హీరో నానికి త‌ప్పిన ప్ర‌మాదం...!

Hero Nani luckily escaped accident while shooting for Dasara Movie.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన కొద్ది మంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Aug 2022 12:36 PM IST
హీరో నానికి త‌ప్పిన ప్ర‌మాదం...!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన కొద్ది మంది న‌టీన‌టుల్లో నేచుర‌ల్ స్టార్ నాని ఒక‌రు. ప‌క్కంటి కుర్రాడిగా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేశాడు. ఇటీవ‌ల 'అంటే సుంద‌రానికి'తో ఆడియ‌న్స్ ప‌ల‌క‌రించిన నాని ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దసరా' చిత్రం ఒక‌టి.

అయితే.. ఈ చిత్ర షూటింగ్‌లో నాని తృటిలో ఓ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నార‌నే వార్త ప్ర‌స్తుతం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. షూటింగ్‌లో ఓ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ట్ర‌క్ నుంచి బొగ్గు అంతా నానిపై ప‌డింద‌ట‌. దీంతో చిత్ర యూనిట్ ఒక్క‌సారిగా షాకైంది. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు నానికి ఎటువంటి గాయాలు కాలేద‌ని స‌మాచారం. ఊహించని ఘ‌ట‌న‌తో కొద్దిసేపు చిత్రీక‌ర‌ణ‌కు అంత‌రాయం క‌లిగింది. నాని తిరిగి కోలుకున్నాక చిత్రీకరణ మళ్లీ పునఃప్రారంభమైంది. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కోసం నాని సుమారు 7 కేజీల బరువు తగ్గినట్లు టాక్‌ వినిపిస్తోంది.

Next Story