యంగ్ హీరో నాగ‌శౌర్య ఇంట మొద‌లైన పెళ్లి సంద‌డి.. ఫోటోలు వైర‌ల్‌

Hero Naga Shaurya wedding celebrations started. టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య ఇంట పెళ్లి వేడుక‌లు ప్రారంభం అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Nov 2022 8:38 AM IST
యంగ్ హీరో నాగ‌శౌర్య ఇంట మొద‌లైన పెళ్లి సంద‌డి.. ఫోటోలు వైర‌ల్‌

జ‌యాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య. నేడు(నవంబ‌ర్ 20 ) త‌న బ్యాచిల‌ర్ లైఫ్‌కి గుడ్ బై చెప్ప‌నున్నాడు.పెద్ద‌లు చూసిన అమ్మాయిని ఆదివారం పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంటీరియర్ డిజైనర్‌గా ఉన్న అనూష శెట్టి మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నాడు. సంప్రదాయబద్దంగా బంధు, మిత్రుల సమక్షంలో బెంగుళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో వీరి పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.


ఇప్ప‌టికే నాగ శౌర్య ఇంట పెళ్లి వేడుక‌లు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుక‌ల్లో భాగంగా నిన్న హాల్దీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అనంత‌రం కాక్‌టైల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో శౌర్య త‌న‌కు కాబోయే భార్య అనూష శెట్టి వేలికి ఉంగ‌రం తొడిగాడు. కుటుంబ స‌భ్యులు, మిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీరిద్ద‌రి జోడి బాగుందంటూ నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.



Next Story