మహేష్ బాబు కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మహేష్ బాబు వద్ద ఇప్పటికీ ఎన్నో కార్లు ఉన్నా కూడా ఈ కొత్త కారు కొనడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

By Bhavana Sharma  Published on  26 Jun 2023 1:10 PM IST
Hero Mahesh Babu, new car, Tollywood, Car collection

మహేష్ బాబు కొత్త కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్న గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు హీరో మహేష్ బాబు. రాబోయే మూడు నెలల వరకు బ్రేక్ లేకుండా ఈ సినిమాకు షూటింగ్ చేయబోతున్నాడు ఈ సూపర్ స్టార్. సినిమాలు చేసేది సంవత్సరానికి ఒకటి మాత్రమే అయినా, యాడ్లు మాత్రం పదికి పైనే ఉంటాయి బాబుకి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ హీరోలతో పోలిస్తే మహేష్ బాబు చేసే యాడ్లు ఎక్కువ. ఇలా సినిమాలు కన్నా కూడా ఈ యాడ్లతో కోట్ల రూపాయలను వెనకేసుకొస్తున్నాడు మహేష్ బాబు.

మహేష్ బాబు వద్ద ఎన్నో లగ్జరీ కార్లో ఉన్నప్పటికీ, అవి సరిపోవు అన్నట్టు మరో కొత్త కారు కొన్నాడు. ఆయన వద్ద రేంజ్ రోవర్ కార్లు ఉన్నా కూడా కొత్తగా వచ్చిన రేంజ్ రోవర్ లేటెస్ట్ మోడల్ ఎస్ వి వర్షన్ లో గోల్డ్ కలర్ కారును కొన్నాడట. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కారు ధర ఎంతో తెలిస్తే నోరెళ్ళ పెడతారు. అక్షరాలా 5.4 కోట్ల రూపాయలు ఈ కారు. అది మాత్రమే కాకుండా హైదరాబాదులో గోల్డ్ కలర్ కొన్న మొదటి వ్యక్తి మహేష్ బాబే నట. మహేష్ బాబు ఉన్నట్టుండి ఈ కారు కొనడానికి కూడా పెద్దగా కారణం ఏమీ లేదట.

మహేష్ బాబు కు సినిమాలతో పాటు సైడ్ బిజినెస్ లు కూడా ఉన్నాయి. గచ్చిబౌలి లో ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ఏషియన్ మహేష్ బాబు థియేటర్ లతో పాటు బంజారాహిల్స్ లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఇలా వద్దన్నా కొద్ది డబ్బు వచ్చి పడడంతో దాన్ని ఏం చేయాలో అర్థం కాక కార్లు మరియు ఆస్తులు కొంటూ ఉన్నవి చాలా అన్నట్టు మరిన్ని వెనకేసుకుంటున్నాడు మహేష్ బాబు.

త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళితో చేతులు కలపనున్నాడు మహేష్ బాబు. ఇప్పటివరకు రాజమౌళితో కలిసి పని చేసిన ప్రతి హీరో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందాడు. ఇక నెక్స్ట్ మహేష్ బాబే!

Next Story