హీరో కార్తీ కొడుకు పేరేంటో తెలుసా..?

Hero karthi reveals newborn son's name be kandhan.తాజాగా హీరో కార్తీ తన కొడుకుకు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసుకోవడమే కాకుండా పేరును కూడా అభిమానులకు తెలిపాడు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 19 March 2021 3:47 PM IST

Hero karthi reveals newborn sons name be kandhan

కార్తీ.. తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ ఫాలోయింగ్ అనే సంగతి తెలిసిందే..! హీరో కార్తీ గతేడాది మరోసారి తండ్రి అయ్యాడు. భార్య రంజని 2020 అక్టోబర్‏లో పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఇక కార్తీ అభిమానులు తమ అభిమాన హీరో కొడుకు పేరు ఏమిటి.. ఫోటో అప్లోడ్ చేయొచ్చు కదా సార్ అంటూ కామెంట్లు మీద కామెంట్లు సోషల్ మీడియాలో పెట్టడం మొదలు పెట్టారు. కార్తీ కూడా తన కుమారుడి పేరును చెప్పలేదు. తాజాగా తన కొడుకుకు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసుకోవడమే కాకుండా పేరును కూడా అభిమానులకు తెలిపాడు. దీంతో అభిమానులు ఆ పోస్టును వైరల్ చేస్తూ వచ్చారు.


కార్తీ తన కొడుకు ఫోటోతోపాటు పేరును అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈమేరకు తన ఇన్ స్టాలో "నేను, మీ అమ్మ, నీ సోదరి ఎంతో ప్రేమతో నీకు కందన్ అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి".. అంటూ పోస్టు పెట్టాడు. కార్తీ, రంజనీ దంపతులకు 2011లో వివాహం జరిగింది. 2013లో ఈ జంటకు ఉమయాల్ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ దంపతులకు 7 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం సుల్తాన్, పొన్నీయన్ సెల్వన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కార్తీ. ప్రస్తుతం కార్తీ సుల్తాన్ సినిమా చేస్తున్నాడు. రెమో ఫేం భ్యాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తూ ఉంది.





Next Story