సడెన్‌గా అభిమానులకు షాకిచ్చాడు అల్లు శిరీష్. కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. అయితే.. ఇందుకు గల కారణాలను మాత్రం శిరీష్ వెల్లడించలేదు. ఇది చాలా స్పెషల్ రోజు అంటూ చివరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్ ట్వీట్ వైరల్‌గా మారింది. 'ఈ ఏడాది నవంబర్ 11వ తేదీ నాకు చాలా ప్రత్యేకమైంది. నా వృత్తి జీవితంలో ఇది మరిచిపోలేని రోజు. ఎందుకనే విషయాన్ని రానున్న రోజుల్లో చెబుతాను. అప్పటి వరకు కొన్ని కారణాల వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను' అని ట్వీట్ చేశారు.
11/11/2021 will be one of the best days in my profesional life. Why, what I'll share over the coming weeks. I've been off social media for a reason :)
కాగా.. అల్లు శిరీష్ ట్వీట్ మై నెటీజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అన్నా పెళ్లి కుదిరిందా..? అంటూ రకరకాల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. 'నేను వృత్తి పరంగా స్పెషల్ డే అని మరీ చెప్పాను గా సామీ' అంటూ శీరీష్ రిప్లై ఇచ్చాడు. మరో నెటిజన్.. హాలీవుడ్ కు వెళ్తున్నారా ? అని అడగ్గా.. 'అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్ అయింది, కథ నచ్చింది. అదే ఆనందం. నా కెరీర్‌లో ఇది బెస్ట్ స్క్రిప్ట్ అవుతుందనుకుంటున్నాను' అంటూ అసలు మ్యాటర్ చెప్పేశాడు శిరీష్.