నా ఆఫీసును ఇలా వాడుతావ‌ని అనుకోలేదు : నాని

Hero Adivi Sesh shares a video and nani question him. నాని ఆఫీసులో అత‌డికి తెలియ‌కుండా అడివి శేష్ ఓ వీడియో షూట్ చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2022 1:23 PM IST
నా ఆఫీసును ఇలా వాడుతావ‌ని అనుకోలేదు : నాని

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్‌. ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'హిట్‌-2'. శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి క‌థానాయికగా న‌టిస్తోంది. ఈ చిత్రానికి నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. నాని ఆఫీసులో అత‌డికి తెలియ‌కుండా అడివి శేష్ ఓ వీడియో షూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై నాని స్పందించాడు.' నా ఆఫీసును ఇలా కూడా వాడుకుంటారా 'అంటూ ప్ర‌శ్నించాడు.

త‌న తాజా చిత్రం 'హిట్‌-2'లోని ఉరికే ఉరికే అనే రొమాంటిక్ పాట‌కు హీరోయిన్ మీనాక్షి చౌద‌రితో క‌లిసి అడివి శేష్ డ్యాన్స్ చేశాడు. "ఇది నిజం నేను ఉరికే ఉరికే పాట‌కు డ్యాన్స్ చేశా. ఇలా డ్యాన్స్ చేయ‌డం కాస్త సిగ్గుగా ఉంది. అయినా మీకోసం ఏదైనా చేస్తా " అంటూ శేష్ వీడియో షేర్ చేశాడు. చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగానే ఇలా చేశాడు. ఇది చూసిన నాని పై విధంగా స్పందించాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ట్వీట్లు వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

Next Story