మహాత్మ గాంధీపై, ఆయన ప్రేరణతో వచ్చిన సినిమాలివే

భారత జాతి పిత మహాత్మ గాంధి జయంతి ఇవాళ. బ్రిటీష్ వారి బానిసత్వం నుండి భారతదేశాన్ని విడిపించడానికి గాంధీజీ ఎన్నో ఉద్యమాలు చేశారు.

By అంజి  Published on  2 Oct 2023 9:32 AM IST
Mahatma Gandhi, Gandhi inspired movies, Gandhi Jayanti

మహాత్మ గాంధీపై, ఆయన ప్రేరణతో వచ్చిన సినిమాలివే

భారత జాతి పిత మహాత్మ గాంధి జయంతి ఇవాళ. బ్రిటీష్ వారి బానిసత్వం నుండి భారతదేశాన్ని విడిపించడానికి గాంధీజీ ఎన్నో ఉద్యమాలు చేశారు. సత్యం, అహింసను ఆయుధంగా చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది. ఆయన చెప్పిన గొప్ప మాటలు ఎంతో మందికి స్ఫూర్తి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, గాంధీని శాంతికి ప్రపంచ చిహ్నంగా, అత్యంత దుర్బలత్వానికి న్యాయవాదిగా పేర్కొన్నారు.

జనాదరణ పొందిన సంస్కృతిలో కూడా, ద్వేషం యొక్క వ్యర్థం, మానవతావాదం, ప్రేమ యొక్క ప్రాధాన్యత గురించి కథనాలను నిర్మించడానికి గాంధీ సినిమా రచయితలు, చలనచిత్ర నిర్మాతలను ప్రేరేపించారు. నేడు గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన కథతో, ఆయన జీవితం స్పూర్తితో తెరకెక్కిన సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. 'శోభాయాత్ర', 'గాంధీ', 'ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మ', 'హే రామ్', 'లగే రహో మున్నా భాయ్' ఆకట్టుకునే ఈ సినిమాలు గాంధేయ విలువలను తెలియజేస్తాయి.

గాంధీ: గాంధీ జీవిత కథ ఆధారంగా వచ్చిన 'గాంధీ' సినిమా బెస్ట్‌ టాక్‌ వచ్చింది. 1982లో వచ్చిన ఈ సినిమాలో గాంధీగా హాలీవుడ్ నటుడు బెన్ కింగ్ స్లే గొప్పగా నటించారు. రిచర్డ్ అటెన్ బరో రూపొందించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది.

ది మేకింగ్ ఆఫ్ మహాత్మ: 1996లో 'ది మేకింగ్ ఆఫ్ మహాత్మ' సినిమా వచ్చింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. దక్షిణ ఆఫ్రికాలో గాంధీ ఉన్న రోజుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన అహింసామార్గాన్ని ఎలా ఎంచుకున్నారు. దీనికి ఆయన జీవితంలో బీజం ఎక్కడ పడింది? అన్న విషయాలు 'ద మేకింగ్ ఆఫ్ మహాత్మ' సినిమాలో చూపించారు.

హేరామ్: 2000 సంవత్సరంలో గాంధీపై ఓ సినిమా వచ్చింది. కమల్ హాసన్, షారుక్ ఖాన్‌ కలయికలో వచ్చిన చిత్రం 'హేరామ్' వివాదాస్పదమైంది. మహాత్మాగాంధీని నాథూరామ్ గాడ్సే చంపిన నేపథ్యంతో పాటు భారత్ పాకిస్థాన్ విడిపోయిన ఉదంతం నేపథ్యంలో తెరకెక్కించారు. షారుక్ ఖాన్ ఈ సినిమాలో అంజాద్ అలీఖాన్ గా అతిథి పాత్రలో కనిపించారు. ఈ మూవీపై అప్పట్లో అనేకమంది విమర్శలు గుప్పించారు.

లగేరహో మున్నాభాయ్: 2006లో గాంధీజీ మార్గం ఈ తరానికి అర్థం అయ్యేలా లగేరహో మున్నా భాయ్ అనే చిత్రం చేశారు. ఈ సినిమాలో ఒక మాములు దాదా కూడా గాంధీగిరికి తలొగ్గి మంచివాడిగా మారతాడు. గాంధీజీ నడిచిన దారి, ఆయన ఆలోచనలు ఇప్పుడు కూడా ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలని చాలా విశదంగా, వినోదాత్మకంగా వివరించారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన లగేరహో మున్నాభాయ్ సూపర్ హిట్. ఇదే సినిమాని తెలుగులో శంకర్‌దాదా జిందాబాద్‌గా పునర్నిర్మించారు. సంజయ్ దత్ హీరోగా నటించారు.

Next Story