సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. 'హ్యారీపోటర్' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫాల్ గ్రాంట్ కన్నుమూశారు. లండన్‌లోని యూస్టర్ రోడ్ లోని సెయింట్ పాంక్రస్ స్టేషన్ లో ఒక్కసారిగా ఫాల్ కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు
పీటర్ బరోకు చెందిన పాల్ గ్రాంట్ బ్రిటీష్ యాక్టర్. ఇతడికి ముగ్గురు పిల్లలు సంతానం. 1980లో 'విల్లో', 'లైబరన్త్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో 'హ్యారీపోటర్', 'స్టార్ వార్స్' లాంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
పాల్ గ్రాంట్ స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ కారణంగా మరగుజ్జులా ఉండిపోయాడు. దీంతో పలు అనారోగ్య సమస్యలు వచ్చేవి. ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్‌కు అడిక్ట్ అయ్యాడు. 2014లో కొకైన్ సేవిస్తూ దొరికిపోవడం అప్పట్లో సంచలనం రేపింది.