విషాదం.. ప్రముఖ హాలీవుడ్ న‌టుడు రాబీ కోల్ట్రేన్ క‌న్నుమూత‌

Harry Potter actor Robbie Coltrane dies at 72.సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. నటుడు రాబీ కోల్ట్రేన్ క‌న్నుమూశాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Oct 2022 8:13 AM IST
విషాదం.. ప్రముఖ హాలీవుడ్ న‌టుడు రాబీ కోల్ట్రేన్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. 'హ్యారీ పోటర్' సినిమాల్లో నేరాలను పరిష్కరించే మనస్తత్వవేత్త అయిన హాగ్రిడ్ పాత్ర‌లో నటించిన స్కాటిష్ నటుడు రాబీ కోల్ట్రేన్ క‌న్నుమూశాడు. ఆయన వయసు 72 సంవ‌త్స‌రాలు. శుక్రవారం స్కాట్లాండ్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడ‌ని కోల్ట్రేన్ ఏజెంట్ బెలిండా రైట్ తెలిపారు. అయితే.. ఆ మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

బ్రిటీష్ టీవీ సిరీస్‌'క్రాక‌ర్‌'లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాబీ కోల్ట్రేన్. రాబి వరుసగా మూడుసార్లు ఉత్తమ నటుడిగాబ్రిటీష్ అకాడమీ టెలివిజన్ ( BAFTA TV) అవార్డులు గెలుచుకున్నాడు. అతను రెండు జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా నటించాడు. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా విజ‌య‌వంతం అయిన హ్యారీ పోట‌ర్ సిరీస్‌లో హాగ్రిడ్ పాత్ర‌తో ప్రాచుర్యం పొందాడు. 2001 నుంచి 2011 మధ్య విడుదలైన మొత్తం 8 హ్యారీ పోటర్ సినిమాల్లో బాల మాంత్రికుడికి గురవుగా, స్నేహితుడిగా వ్యవహరించే సున్నితమైన హాఫ్ జెయింట్ పాత్రను పోషించాడు. చివరిసారిగా హ్యారీ పాటర్ 20వ వార్షికోత్సవం: రిటర్న్ టు హాగ్వార్ట్స్‌లో కనిపించాడు. అత‌డి మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు హాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Next Story