షాకింగ్ : టూరిజం అంబాసిడ‌ర్ ప‌ద‌వి నుండి త‌ప్పుకున్న‌ దేత్తడి హరిక

Harika Resigns Tourism Ambassador Post. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించి హారిక సంచ‌ల‌నానికి తెర‌లేపారు

By Medi Samrat  Published on  11 March 2021 4:31 AM GMT
Harika Resigns Tourism Ambassador Post

బిగ్‌బాస్ రియాలిటీ షో తో దేత్తడి హరిక ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మహిళా దినోత్సవం నాడు హారిక‌ను.. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా ప్ర‌క‌టించింది. అయితే.. ఆ అంబాసిడర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించి హారిక సంచ‌ల‌నానికి తెర‌లేపారు. కొన్ని కార‌ణాల కార‌ణంగా కొన‌సాగ‌లేక పోతున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు.

ఇదిలావుంటే.. మహిళా దినోత్సవం నాడు టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ హారిక‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ.. అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. అప్పటి నుంచి వివాదం మొదలై.. రోజుకో కొత్త మలుపు తిరిగింది. స‌ద‌రు కార్పొరేషన్‌ చైర్మన్ ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విష‌య‌మై టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ కూడా మాట్లాడారు.

హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారమూ లేదని అన్నారు. ఈ విష‌య‌మై విచారించి వేరొకరిని నియమిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హారిక బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Next Story