'హరిహర వీరమల్లు' సినిమాపై అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'.
By Srikanth Gundamalla
'హరిహర వీరమల్లు' సినిమాపై అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ బిజీ అయ్యారు. దాంతో.. హరిహర వీరమల్లు సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్ ఏమీ రాలేదు. ఈ నేపథ్యంలో రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత ఏఎమ్ రత్నం కీలక అప్‌డేట్ ఇచ్చారు. పుకార్లు అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత ఏఎమ్ రత్నం మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20. రోజులు ఆయన డేట్స్ తీసుకుని ఏదోటి తీయొచ్చని అన్నారు. కానీ.. ఆయనతో తీసే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు మరింత మంచి పేరు రావాలని వ్యాఖ్యానించారు. అయితే.. పవన్‌తో తాను తీస్తోన్న సినిమా పాన్ ఇండియా సినిమా అని ఏఎమ్ రత్నం అన్నారు. చిత్రం ఆగిపోయిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారనీ.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమా ఆగిపోలేదనీ.. దీనికి రెండో భాగం కూడా ఉంటుందని వెల్లడించారు.
హరిహర వీరమల్లు సినిమా కథ 17వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుందనీ తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్‌కు సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇదే మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.