ఫాద‌ర్స్ డే విషెస్ తెలిసిన చిరంజీవి, మ‌హేష్ బాబు

Happy Father’s Day 2022 Chiranjeevi and other Tollywood celebs extend wishes.ఒక గొప్ప కొడుకుగా, గ‌ర్వించే తండ్రిగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2022 1:18 PM IST
ఫాద‌ర్స్ డే విషెస్ తెలిసిన చిరంజీవి, మ‌హేష్ బాబు

ఒక గొప్ప కొడుకుగా, గ‌ర్వించే తండ్రిగా అంద‌మైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాన‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా త‌న తండ్రితో క‌లిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తండ్రులంద‌రికీ ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చిరంజీవి మాత్ర‌మే కాకుండా ప‌లువురు సినీ సెలబ్రిటీలు తమ తండ్రులకు విషెస్‌ తెలియజేస్తున్నారు. వారితో ఉన్న అనుబంధాన్ని, వారితో ఉన్న గుర్తులను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు.

త‌న తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణతో దిగిన ఫోటోని షేర్‌ చేశారు మహేష్ బాబు. నాన్నగురించి ఎమోషనల్‌ వర్డ్స్ పోస్ట్ చేశారు. ఇందులో `తండ్రి అంటే ఏంటో నాకు చూపించారు. తండ్రిగా ఎలా ఉండాలనే నేర్పించారు. తండ్రికి ఉదాహరణగా నన్ను నడిపించారు. మీరు లేకుండా నేను ఉండేవాడిని కాదు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా అంటూ రాసుకొచ్చారు.






Next Story