'హ్యాపీ బర్త్​డే' టీజర్.. ఇంటింటికీ గన్ను.. ఎదురులేని ఫన్‌

Happy Birthday Movie Teaser out.అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2022 3:07 PM IST
హ్యాపీ బర్త్​డే టీజర్.. ఇంటింటికీ గన్ను.. ఎదురులేని ఫన్‌

'అందాల రాక్షసి' చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసింది లావ‌ణ్య త్రిపాఠి. తాజాగా ఆమె న‌టిస్తున్న చిత్రం 'హ్యాపీ బ‌ర్త్ డే'. 'మత్తు వదలరా' ఫేమ్​ రితేష్ రాణా దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నరేశ్ అగస్త్య హీరోగా న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జులై 15 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంబించింది. ఈ క్ర‌మంలో ఈ చిత్ర టీచ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఆయుధాల చ‌ట్టం అంటే..? అనే డైలాగ్‌ల‌తో ప్రారంభ‌మైన టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. ఇంటింటికి గన్ను.. ఎదురులేని ఫన్‌.. వంటి డైలాగ్‌లు న‌వ్వు తెప్పించేలా ఉన్నాయి. ఆద్యంతం ఔట్​ అండ్​ ఔట్​ ఎంటర్​టైనర్​గా ఉన్న ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం యూ ట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Next Story