'జై హనుమాన్‌'లో స్టార్‌ హీరో.. ప్రశాంత్‌వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'హనుమాన్' సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది.

By Srikanth Gundamalla  Published on  22 Jan 2024 4:32 PM IST
hanuman movie, director prasanth varma,  tollywood,

'జై హనుమాన్‌'లో స్టార్‌ హీరో.. ప్రశాంత్‌వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'హనుమాన్' సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. పెద్ద సినిమాలను కూడా పక్కకు తోసి హిట్‌టాక్‌లో ముందు వరుసలో నిలిచింది ఈ మూవీ. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ హనుమాన్‌ మూవీ విజువల్స్.. కథ ఎంతో బాగున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు కూడా అదేమాట చెప్పారు. విజువల్‌ వండర్‌ అనిపించిందనీ.. ప్రశాంత్‌వర్మ యూనివర్స్‌లోకి వెళ్లిపోయామని కామెంట్‌ చేశారు. అయితే.. బాక్సాఫీస్‌ వద్ద ఇంకా ఈ సినిమా వసూళ్లను రాబడుతూనే ఉంది. కాగా.. హనుమాన్ మూవీకి సీక్వెల్ ఉందని ఎండ్‌లో డైరెక్టర్ చెప్పేశాడు.

హనుమాన్‌ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటించాడు. హీరోయిన్‌గా అమృత అయ్యర్ నటించగా.. వరలక్ష్మి హీరోకు అక్క పాత్రలో కనిపించింది. అయితే.. సీక్వెల్‌గా రాబోతున్న జై హనుమాన్‌లో మాత్ర గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హనుమాన్‌ కంటే వంద రెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ మూవీ ఉండబోతుందని చెప్పాడు. అంతేకాదు.. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదని చెప్పాడు. కానీ.. సీక్వెల్‌లో కూడా అతను హనుమంతు పాత్రలో కనిపిస్తాడని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెప్పాడు.

అయితే.. జైహనుమాన్‌ మూవీలో హీరో అంజనేయస్వామి అనీ.. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారని ప్రశాంత్‌ వర్మ చెప్పాడు. కాగా.. ఈ సీక్వెల్‌ను 2025లో విడుదల చేస్తామని చెప్పేశాడు. ఇక ఈ మూవీ కంటే ముందు తన దర్శకత్వంలో మరో రెండు సినిమాలు రాబోతున్నాయని చెప్పాడు. ఒకటి 'అధీర' కాగా.. మరోటి 'మహాకాళి' అని ప్రశాంత్‌ వర్మ చెప్పాడు. అయితే.. హనుమాన్ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ సాధించడంలో టీమ్‌ సహకారం ఉందని పరశాంత్‌ వర్మ చెప్పుకొచ్చాడు. రూ.45 కోట్ల బడ్జెట్‌తో హనుమాన్‌ తెరకెక్కగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో రూ.200 కోట్లను వసూళ్లు చేసినట్లు అంచనా.

Next Story