హన్సికను పెళ్లి చేసుకోబోయేది ఇతడే
Hansika introduces fiance Sohael in new post as he proposes to her in front of Eiffel Tower.దేశముదురు చిత్రంతో యువత
By తోట వంశీ కుమార్
'దేశముదురు' చిత్రంతో యువత హృదయాలను కొల్లగొట్టిన నటి హన్సిక. ఆ తరువాత దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగొందింది. ఈ ముంబై ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. డిసెంబర్‌లో నెలలో తాను వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇక అప్పటి నుంచి హన్సిక ను పెళ్లి చేసుకోబోయే భర్త ఎవరు..? ఎలా ఉంటాడు..? అన్న ప్రశ్నలు వేస్తూ ఆమెను విసిగిస్తున్నారు. తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది బొద్దుగమ్మ. తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. అంతేకాదండోయ్.. తన ప్రియుడితో పారిస్‌లో ఈపిల్ టవర్ వద్ద కలిసి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
ఈ ఫోటోలలో సోహైల్.. మోకాలిపై కూర్చోని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేయగా.. అంగీకరించిన ఆమె అతడిని కౌగలించుకుంది. "ఇప్పటికీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా" అని ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక వీరి వివాహాం డిసెంబర్ 4న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లోని ఓ రాజకోటలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుంది. పెళ్లికి రెండు రోజుల ముందు నుంచి సంగీత్, మెహిందీ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. హన్సిక నటించిన 'పార్ట్‌నర్', '105 మినట్స్' చిత్రాల షూటింగ్‌లు పూర్తి అవ్వగా, తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి', తమిళంలో నాలుగు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.