మహాభారత్‌ 'శకుని' మామ పాత్ర నటుడు మృతి

Gufi Paintal, Shakuni Mama of BR Chopra’s Mahabharat, passes away at 79. మహాభారత్‌ సీరియల్‌లో శకుని పాత్రను పోషించిన సీనియర్‌ నటుడు గుఫి పైంటాల్‌ కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 5 Jun 2023 4:00 PM IST

మహాభారత్‌ శకుని మామ పాత్ర నటుడు మృతి

మహాభారత్‌ సీరియల్‌లో శకుని పాత్రను పోషించిన సీనియర్‌ నటుడు గుఫి పైంటాల్‌ కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. వారం రోజుల కిందట అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గుఫి సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో చనిపోయారు. గుఫికి ఓ కొడుకు, కోడలు, మనవడు ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు అంధేరి సబర్బన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియులు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. మహాభారత్‌లో పాటు గుఫి పలు సీరియల్స్‌, సినిమాల్లో నటించారు. బహదూర్‌ షా జఫర్‌, కానున్‌, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై, ద్వారకాధీష్‌ భగవాన్‌ శ్రీకృష్ణ, రాధాకృష్ణ, వంటి సీరియల్స్‌లో నటించారు. 1975లో వచ్చిన రఫూ చక్కర్‌ సినిమాతో బాలీవుడ్‌లో ప్రవేశించారు గుఫి. దిల్లగి, దేశ్‌ పరదేశ్‌, సుహాగ్‌ సినిమాల్లో నటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.



Next Story