హీరో గోపిచంద్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంటున్న ద‌ర్శ‌కుడు మారుతి

Gopichand new movie Pakka Commercial.దర్శకుడు మారుతి తో హీరో గోపి చంద్ కొత్త సినిమా పక్క కమర్షియల్.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Feb 2021 5:37 AM GMT
Gopichand new movie Pakka Commercial

విల‌న్‌గా కెరీర్‌ను ఆరంభించి త‌రువాత హీరోగా మారాడు గోపిచంద్‌. ఆరంభంలో విజ‌యాలను అందుకుని జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తూ వ‌చ్చాడు. అయితే.. మ‌ధ్య‌లో కొన్ని ప‌రాజ‌యాలు రావ‌డంతో కొంత నెమ్మ‌దించాడు. వైవిధ్యమైన చిత్రాల‌ను చేయాల‌ని నిర్ణ‌యించుకుని అందుక‌నుగుణంగా చిత్రాల‌ను ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగానే టాలెంట్ డైరెక్ట‌ర్ మారుతితో జ‌త‌క‌ట్టాడు. వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కె చిత్రానికి ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. మార్చి 5 నుంచి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాని బన్ని వాసు, వంశీలు గీత ఆర్ట్స్ బ్యానర్ మరియు యు.వి.క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపిచంద్ స‌ర‌స‌న రాశిఖ‌న్నా న‌టించే అవ‌కాశం ఉంది. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


Next Story
Share it