ఆనందంలో మెగా ఫ్యామిలీ.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

మెగా ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చింది. మెగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది.

By అంజి  Published on  20 Jun 2023 1:32 AM
mega fans, Upasana, baby girl, Ram Charan

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

మెగా ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చింది. మెగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసనలు అమ్మా నాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన.. ఈ తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇవాళ ఉదయం ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు, తల్లీబిడ్డ ఇద్దరూ బాగున్నారని అపోలో ఆస్పత్రి మెడికల్‌ బులిటెన్‌లో తెలిపింది. ఆసుపత్రిలో రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులు ఈ ఉద్విగ్న క్షణాలను ఎంతో ఆనందించారు. ఇవాళ మెగా, కామినేని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రిని సందర్శించి రామ్‌చరణ్ - ఉపాసనలకు పుట్టిన ఆడబిడ్డను ఆశీర్వదించనున్నారు. ఇప్పటికే మెగాభిమానులు మెగా వారసురాలి పేరు మీద అనేక దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయించేందుకు రెడీ అయ్యారు.

మరోవైపు సినీ ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు అందరూ సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్ 14, 2012లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యి పదేళ్లయిన తర్వాత వీళ్లు దంపతులు కావడంలో ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో వీరి గురించి పిల్లల విషయంలో సోషల్‌ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. వాటన్నింటిని ఉపాసన రాంచరణ్ భరించారు. ఇంట్లో వాళ్ళు కూడా పిల్లల విషయంలో ఉపాసన రామ్ చరణ్‌ని ఒత్తిడి చేశారట. కానీ వీళ్ళు మాత్రం తమకు నచ్చినట్లే చేసి జీవితంలో సెటిల్ అయ్యాక పిల్లల్ని కన్నారు. ఇటీవలే రామ్ చరణ్ ఉపాసన తాజాగా తమ 11వ పెళ్లిరోజుని గ్రాండ్‌గా జరుపుకున్నారు.

Next Story