విజయ్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్
విజయ్ ‘లియో’ సినిమా యూనిట్ బెనిఫిట్ షోలకు అనుమతి కోరగా.. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 4:00 PM ISTవిజయ్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘లియో’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ న్యూస్ వచ్చింది. సినిమా యూనిట్ బెనిఫిట్ షోలకు అనుమతి కోరగా.. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 5 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. అక్టోబర్ 19 నుంచి 24 వరకు ‘లియో’ సినిమా 5 షోలకు అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది.
విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీసు రికార్డులన్నిటినీ కొల్లగొట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. విజయ్-త్రిష జోడీని వెండితెరపై చూసి చాలా ఏళ్లు అవుతూ ఉండడంతో ఈ కాంబినేషన్ ను చూడడం కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ను కూడా ఈ సినిమాలో ఉన్నారు. విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్' బాక్సాఫీస్ హిట్ గా నిలవగా.. 'లియో' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ న్యూస్ వచ్చింది. సినిమా యూనిట్ బెనిఫిట్ షోలకు అనుమతి కోరగా.. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.