మెగాస్టార్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక..!

Good boy for Rashmika Mandanna.రష్మిక మందాన.. కన్నడ బ్యూటీ 'కిరిక్ పార్టీ' సినిమాతో హిట్ అందుకొని.. ఆ తర్వాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 March 2021 5:37 AM GMT
మెగాస్టార్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక..!

రష్మిక మందాన.. కన్నడ బ్యూటీ 'కిరిక్ పార్టీ' సినిమాతో హిట్ అందుకొని.. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయి.. తమిళం, హిందీ భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ లో పాగా వేయాలని అనుకుంటూ ఉంది. రష్మిక మందాన, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న 'మిషన్ మజ్ను' చిత్రం షూటింగులో పాల్గొంటూ ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తూ ఉండగానే మరో సినిమాలో అవకాశం దక్కించుకుందని టాక్ వినిపిస్తూ ఉంది. అది కూడా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమాలో.

ఈ చిత్రానికి తాజాగా 'గుడ్ బాయ్' అనే టైటిల్ని నిర్ణయించారు. ఇందులో అమితాబ్, రష్మిక తండ్రీకూతుళ్లుగా నటిస్తారని కూడా అంటున్నారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా చేస్తే రష్మిక మందాన చేయబోయే రెండో హిందీ సినిమా అవుతుంది. రష్మిక బాలీవుడ్ కు కొత్తగా వెళ్లినప్పటికీ.. పెద్ద ఎత్తునే రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉందని అంటున్నారు. అమితాబ్ సినిమా కోసం ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తూ ఉంది. 1970లలో జరిగిన స్టోరీని గుడ్ బాయ్ లో చూడొచ్చు అని అంటున్నారు. వికాస్ భల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.

రష్మిక కార్తీతో నటిస్తున్న 'సుల్తాన్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్. ఈ సినిమా 'పాన్-ఇండియా' స్థాయిలో విడుదల కాబోతూ ఉండడంతో భారీ అంచనాలే ఉన్నాయి.


Next Story