గాడ్ ఫాదర్ తొలి రోజు షాకింగ్ కలెక్షన్స్

GodFather First Day Collections Are Here.మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం 'గాడ్ ఫాద‌ర్‌'. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2022 3:15 PM IST
గాడ్ ఫాదర్ తొలి రోజు షాకింగ్ కలెక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం గాడ్ ఫాద‌ర్‌. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా నిన్న‌(బుధ‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్‌, స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. మ‌రీ మొద‌టి రోజున ఈ చిత్రం ఎంత వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిందో చూద్దాం.

ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజున ఈ చిత్రం 38 కోట్ల గ్రాస్ ను వ‌సూలు చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం తెలియ‌జేస్తూ అంద‌కు సంబంధించిన పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 20.9 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

తెలుగు రాష్ట్రాల్లో వ‌సూళ్లు ఇలా..

నైజాంలో రూ.3.25కోట్లు, సీడెడ్ 3.05 కోట్లు, ఉత్తరాంధ్ర 1.26 కోట్లు, నెల్లూరు రూ.57 లక్షలు, గుంటూరు రూ.1.75కోట్లు, కృష్ణా రూ.72.5ల‌క్ష‌లు, తూర్పుగోదావ‌రి రూ.1.60కోట్లు, వెస్ట్ గోదావ‌రి రూ.80ల‌క్ష‌లు

ట్రేడ్ వ‌ర్గాల లెక్క‌ల ప్ర‌కారం మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున గాడ్ ఫాద‌ర్ కు రూ.13కోట్ల రూపాయ‌ల షేర్ వ‌చ్చింది.

Next Story