గాడ్‌ఫాద‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

God Father seals its OTT release date.మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం గాడ్‌ఫాద‌ర్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Nov 2022 11:30 AM IST
గాడ్‌ఫాద‌ర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం 'గాడ్‌ఫాద‌ర్‌'. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, సత్యదేవ్, నయనతార కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా మ‌ల‌యాళ చిత్రం లూసీఫ‌ర్‌కి రీమేక్ గా తెర‌కెక్కింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడంతో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు బాగానే కనెక్ట్ అయ్యింది.


చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా..? అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర రైట్స్ ద‌క్కించుకున్న ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్ శుభ‌వార్త చెప్పింది. నవంబర్ 19 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిపింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే నవంబర్ 19 వరకు ఆగాల్సిందే.

Next Story