లైటింగ్ సూరిబాబు పాత్ర‌లో సుధీర్ బాబు.. టీజ‌ర్ అదిరింది

Glimpse Of Lighting Sooribabu.విభిన్న చిత్రాల‌తో దూసుకెలుతున్న యంగ్ హీరో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబు టీజ‌ర్ అదిరింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2021 5:52 AM GMT
Lighting Sooribabu

జ‌యాప‌జయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాల‌తో దూసుకెలుతున్న యంగ్ హీరో సుధీర్ బాబు. ఇటీవ‌ల ఆయ‌న వి చిత్రంతో ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో అభిమానుల‌ను అల‌రించ‌లేక‌పోయింది. తాజాగా ఆయ‌న 'పలాస 1978' ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో శ్రీదేవి సోడా సెంట‌ర్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. 'భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర' వంటి హిట్‌ సినిమాలను అందించిన 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన‌ టైటిల్, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా.. ఈ రోజు సుధీర్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. లైటింగ్ మెన్ సూరిబాబు పాత్ర‌లో సుధీర్ బాబు అద‌ర‌గొట్టాడు. సుధీర్ లుక్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంపై సుధీర్ భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓసారి లుక్కెయండి.


Next Story