సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసులు ఘంటసాల వెంక‌టేశ్వ‌ర‌రావు రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇంతకుముందే ఆయనకు కరోనా సోకగా, రెండు రోజు క్రితమే కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చింది. కొన్నేళ్లుగా ఆయన కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ర‌త్న‌కుమార్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఘంట‌సాల కుటుంబంలో విషాదం నెల‌కొంది. మ‌రో వైపు ఆయ‌న మ‌ర‌ణ‌వార్త‌తో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనూ విషాద‌చాయ‌లు అలుముకున్నాయి. ఘంట‌సాల ర‌త్న‌కుమార్ గాయ‌కుడిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోనే రాణిస్తున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story