మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. గ‌ని రిలీజ్ డేట్ ఫిక్స్‌

Ghani Movie Release on March 18.మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం గ‌ని. కిరణ్ కుమార్ కొర్రపాటి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Dec 2021 1:23 PM IST
మెగా అభిమానుల‌కు శుభ‌వార్త‌.. గ‌ని రిలీజ్ డేట్ ఫిక్స్‌

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం 'గ‌ని'. కిరణ్ కుమార్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ న‌టిస్తోంది. రినైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబి కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద - అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని తొలుత డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు వెల్ల‌డించారు. అయితే.. వారం ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పాన్ ఇండియన్ చిత్రం 'పుష్ప', 'గని' రిలీజ్ అనుకున్న రోజు నాని 'శ్యామ్ సింగ రాయ్' వస్తుండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.

బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. బాక్సర్ గా వరుణ్ తేజ్ క‌నిపించ‌నుండ‌గా.. కొత్త విడుద‌ల తేదీని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. మార్చి 18న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, నదియా, జగపతి బాబు, త‌మన్నా భాటియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Next Story