గని టైటిల్ సాంగ్ విడుద‌ల‌

Ghani Anthem song released.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Oct 2021 6:23 AM GMT
గని టైటిల్ సాంగ్ విడుద‌ల‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ న‌టిస్తున్న చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ నేడు విడుద‌ల చేశారు. 'దేకో హిం గని.. కనివిని ఎరుగని' అంటూ ఈ పాట సాగుతోంది. త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.

ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. జిమ్ములో తెగ కష్టపడి బాడీ బిల్డ్ చేసి తనను తాను సరికొత్తగా ఆవిష్క‌రించుకోబోతున్నాడు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story
Share it