ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'గీతాంజలి మళ్లీ వచ్చింది'

2014లో వచ్చిన గీతాంజలి సినిమాకి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చింది ఇటీవలే థియేటర్లలో సందడి చేసింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 May 2024 8:52 AM IST
geethanjali malli vachindi, ott, cinema,

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'గీతాంజలి మళ్లీ వచ్చింది'

2014లో వచ్చిన గీతాంజలి సినిమాకి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చింది ఇటీవలే థియేటర్లలో సందడి చేసింది. ఇది హారర్ కామెడీ ఎంటర్‌టైనర్, ఇందులో అంజలి, శ్రీనివాస్ రెడ్డి తమ పాత్రలను మళ్లీ పోషించారు. ఈ చిత్రం థియేటర్లలో మొదటి వారం మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేస్తోంది. ఇప్పుడు తెలుగులో ‘ఆహా’లో ప్రసారం కానుంది. శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఇందులో సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, సునీల్ కూడా నటించారు. భాను భోగవరపుతో కలిసి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రీన్‌ప్లే రాశారు.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ఓ సినిమా షూటింగ్ లో జరిగే పరిణామాల గురించి చూపిస్తుంది. చిత్ర యూనిట్ ఓ హాంటెడ్ మాన్షన్‌లోకి వెళ్ళాక జరిగే కథను ఇందులో చూపించారు. తమ సినిమా స్క్రిప్ట్‌ లో భాగంగా సినిమా తీస్తుంటే దెయ్యాలు వచ్చి ఏమి చేశాయన్నది ఈ సినిమాలో చూపించారు. ఇంతకూ గీతాంజలికి.. గీతాంజలి-2 కి మధ్య ఉన్న లింక్ ఏమిటో కూడా సినిమా చూస్తే తెలుస్తుంది.

Next Story