తల్లికాబోతున్న న‌టి కాజల్ అగర్వాల్.. ఎమోజీతో చెప్పేశాడు

Gautam Kitchlu Confirms Kajal Aggarwal's First Pregnancy.చంద‌మామ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌మైన ముద్దుగుమ్మ కాజ‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jan 2022 11:07 AM IST
తల్లికాబోతున్న న‌టి కాజల్ అగర్వాల్.. ఎమోజీతో చెప్పేశాడు

'చంద‌మామ' చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌మైన ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్. దాదాపు టాలీవుడ్ అగ్ర‌, యువ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వ్యాపార‌వేత్త గౌత‌మ్‌ను ప్రేమించి పెద్ద‌ల అంగీకారంతో అక్టోబ‌ర్ 30, 2020 న వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ శుభ‌వార్త చెప్పింది. కాజ‌ల్ త‌ల్లికాబోతుందంటూ ఆమె భ‌ర్త గౌత‌మ్ కిచ్లు చెప్పేశాడు.

2022లో శుభ‌వార్త వింటార‌ని తెలిపారు. కొత్త‌సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా కాజ‌ల్ ఫోటోను షేర్ చేసిన గౌత‌మ్ కిచ్లు..' 2022 నిన్నే చూస్తున్నా 'అంటూ ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని జ‌త చేశారు. దీంతో కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌ల్లికాబోతున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం కాజ‌ల్‌-కిచ్లు దంప‌తుల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం 'ఆచార్య', 'భారతీయుడు 2', 'హే సినామిక', 'పారిస్ పారిస్' చిత్రాల్లో నటిస్తుంది. ఇందులో ఇప్ప‌టికే 'ఆచార్య' చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. కాజ‌ల్ గ‌ర్భం దాల్చ‌డంతో కొన్ని నెల‌లు షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వ‌నున్న‌ట్లు సినిప‌రిశ్ర‌మ‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

Next Story