ఓటీటీలోకి సాయిప‌ల్ల‌వి 'గార్గి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Gargi Seals Official OTT Release Date.టాలీవుడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి న‌టించిన చిత్రం గార్గి. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2022 11:15 AM IST
ఓటీటీలోకి సాయిప‌ల్ల‌వి గార్గి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి న‌టించిన చిత్రం 'గార్గి'. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై15 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విమ‌ర్శ‌కుల ప్ర‌సంశ‌లు అందుకుంది. దర్శకుడి టేకింగ్‌కి, సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కోర్టు డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబట్టింది.

కాగా.. విడుద‌లై నెల రోజులు కూడా కాకుండే ఓటీటీ బాట ప‌ట్టింది. ఆగ‌స్టు 12న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ 'సోనీలీవ్‌'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని ఓటీటీ సంస్థ 'సోనీలీవ్‌' తెలియ‌జేస్తూ ఓ వీడియోను అభిమానుల‌తో పంచుకుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిపింది. తెలుగులో ఎస్పీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు. ఇదిలా ఉంటే సాయిప‌ల్ల‌వి ప్రస్తుతం కోలీవుడ్‌లో శివ‌కార్తికేయ‌న్‌కు జోడీగా ఓ చిత్రంలో న‌టిస్తోంది.

Next Story