ఓటీటీలోకి వచ్చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఇక చూసేయండి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇటీవల విడుదలైంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి కూడా కీలక పాత్రలు పోషించారు.

By M.S.R  Published on  14 Jun 2024 9:23 AM IST
Gangs of Godavari, movie , OTT, Tollywood

ఓటీటీలోకి వచ్చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. ఇక చూసేయండి 

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇటీవల విడుదలైంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల షేర్ రాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే నిర్మాతలు సినిమాను చాలా ముందుగానే ఓటీటీలో ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారు.

దీంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి జూన్ 14వ తేదీ నుండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని నెట్ ఫ్లిక్స్ లో చూసేయొచ్చు. అన్ని భారతీయ భాషలలో ప్రముఖ OTT జెయింట్, నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనుంది. విడుదల తేదీ నుండి కేవలం 2 వారాలు మాత్రమే థియేట్రికల్ రన్ సాగింది. ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుందని భావించినా యావరేజ్‌గా మాత్రమే నిలిచింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం కూడా అందించారు. ఈ చిత్రం విడుదలైన వారాంతంలో 2/3 కంటే ఎక్కువ రికవరీ సాధించింది కానీ ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడింది. ఇంకా ఎన్నో థియేటర్లలో ఈ సినిమా ఆడుతూ ఉంది. ఇంతలోనే ఓటీటీలోకి వచ్చేసింది.

Next Story