క‌రోనా టీకా తీసుకున్న గంగ‌వ్వ‌.. నొప్పిని త‌ట్టుకోలేక కేక‌లు.. వీడియో వైర‌ల్‌

Gangavva took covid vaccine.తాజాగా గంగ‌వ్వ క‌రోనా టీకా తీసుకుంది. వ్యాక్సిన్ ఇచ్చే స‌మ‌యంలో నొప్పిని భ‌రించ‌లేక గంగ‌వ్వ చిన్న పిల్ల‌లా గ‌ట్టిగా కేక‌లు వేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 4:07 AM GMT
Gangavva takes vaccine

గంగ‌వ్వ.. ప్ర‌స్తుతం ఈ పేరు తెలియ‌ని వారు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉండ‌రు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. యూ ట్యూబ్ తో స్టార్‌గా మారి బిగ్‌బాస్ సీజ‌న్ 4తో అతి త‌క్కువ స‌మ‌యంలో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు. ఇటీవ‌ల కింగ్ నాగార్జున తో క‌లిసి వైల్డ్ డాగ్ చిత్ర ప్ర‌మోష‌న్‌లో హంగామా చేసింది. తాజాగా గంగ‌వ్వ క‌రోనా టీకా తీసుకుంది. మ‌ల్యాల‌లోని ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో మంగ‌ళ‌వారం ఆమెకు క‌రోనా వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే.. వ్యాక్సిన్ ఇచ్చే స‌మ‌యంలో నొప్పిని భ‌రించ‌లేక గంగ‌వ్వ చిన్న పిల్ల‌లా గ‌ట్టిగా కేక‌లు వేసింది.

ప్ర‌స్తుతం గంగవ్వ జ్వ‌రంతో పాటు ఒళ్లు నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. వ్యాక్సిన్ తీసుకున్న త‌రువాత ల‌క్ష‌ణాలు ఇలాగే ఉంటాయ‌ని ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. కాగా.. గంగ‌వ్వ వ్యాక్సిన్ తీసుకునే వీడియోను మై విలేజ్ షో టీమ్.. గంగవ్వ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. గంగ‌వ్వ ఎప్పుడు ఇంజెక్ష‌న్ తీసుకోలేదేమో..? అందుకే అనుకుంటా అంత భ‌యం అని కామెంట్లు చేస్తున్నారు.




Next Story
Share it