గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం, నటులు వీరే
తెలంగాణ సినీ కళాకారులకు, చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'గద్దర్ అవార్డులను' ప్రకటించింది.
By - అంజి |
గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం, నటులు వీరే
హైదరాబాద్: తెలంగాణ సినీ కళాకారులకు, చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'గద్దర్ అవార్డులను' ప్రకటించింది. గతంలో ఉన్న నంది అవార్డుల స్థానంలో ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఈ పురస్కారాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ప్రభుత్వ పురస్కారాల పరంపర మళ్లీ ప్రారంభం కావడంతో సినీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను శనివారం ప్రకటించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించడం ఈ ఏడాది హైలైట్‌గా నిలిచింది.
పురస్కారాల ప్రదానం ఎప్పుడు?
మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరగనుంది. తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేసింది.
గద్దర్ అవార్డులు - 2026 విజేతల జాబితా:
గౌరవ పురస్కారాలు (Special Awards):
ఎన్టీఆర్ జాతీయ అవార్డు: చిరంజీవి
పైడి జయరాజ్ అవార్డు: కమల్ హాసన్
నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: అశ్విని దత్ (నిర్మాత)
ఏఎన్నార్ (ANR) అవార్డు: జయసుధ
సినారే అవార్డు: సుద్దాల అశోక్ తేజ
ప్రధాన విభాగాల్లో విజేతలు:
ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం: దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (సినిమా: తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (సినిమా: ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు: సాయిలు (సినిమా: రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
సాంకేతిక మరియు ఇతర విభాగాలు:
జాతీయ సమగ్రత చిత్రం: తండేల్
ఉత్తమ సందేశాత్మక చిత్రం: కోర్ట్
ఉత్తమ డాక్యుమెంటరీ: యూనిటీ
ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ రాబిన్ (దండోరా)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ గాయని: సాహితీ (కన్నప్ప)
ఉత్తమ సహాయ నటుడు: శివాజీ
ఉత్తమ సహాయ నటి: భూమిక (యూఫోరియా)
పరిచయ దర్శకుడు: సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
ఉత్తమ బాలల చిత్రం: అనగనగా
ఉత్తమ బాలనటుడు: మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత - గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ - ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కింధపురి)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - సందీప్ (ఛాంపియన్)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - తోటకర్ణి (ఛాంపియన్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - గోవిందరాజు (అఖండ 2)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - చంద్రకాంత్ (ఛాంపియన్)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ - పీటర్ (ఛాంపియన్)
స్పెషల్ జ్యూరీ అవార్డులు..
శ్రీరాజ్ రాచకొండ (23 ఫిల్మ్)
చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
రోషన్ మేక (ఛాంపియన్)
అనంతిక (8 వసంతాలు)