రీరిలీజ్‌లో రికార్డుల మోత.. రెడీ అవుతోన్న గబ్బర్‌సింగ్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ మేనియా నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 25 Aug 2024 8:00 AM GMTరీరిలీజ్‌లో రికార్డుల మోత.. రెడీ అవుతోన్న గబ్బర్‌సింగ్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ మేనియా నడుస్తోంది. పెద్ద సినిమాలు ఎక్కువగా లేని సమయంలో కానీ.. లేదంటే స్టార్స్ బర్త్‌డే సందర్భంగా కానీ హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేశ్‌బాబు క్లాసికల్ మూవీ మురారీ రీరిలీజ్‌తో రికార్డులను కొల్లగొట్టింది. ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా వచ్చిన ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది. కాగా.. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్‌డేను కూడా అభిమానులు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బర్త్‌డే ట్రీట్‌గా మూవీ లవర్స్ కోసం సెప్టెంబర్ 1వ తేదీన గబ్బర్ సింగ్ 4కే రీరిలీజ్ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్‌గా థియేటర్లలో విడుదలై అప్పుడు సెన్షేషన్ సృష్టించాడు. ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
దబాంగ్‌కు రీమేక్‌గా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో బండ్ల గణేశ్ గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ రీరిలీజ్ టైంలో కూడా సేమ్ మేనియాను కొనసాగిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 100+ లొకేషన్లకుపైగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారని.. సెప్టెంబర్ 1న యూఎస్‌ఏ, కెనడాలో హాలీడే కావడం వల్ల ఓపెనింగ్ డేన రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు. మరోవైపు యూఎస్‌ఏలో గబ్బర్ సింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. రీరిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించే తెలుగు సినిమాగా చోటు సంపాదించే దిశగా ముందుకెళ్తోంది. గబ్బర్ సింగ్ ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 55 స్రీన్లలో రూ.12,57,178.50 లక్షలు సేల్స్ నమోదు చేసింది.