'గాలి సంప‌త్' ట్రైల‌ర్‌.. తండ్రీకొడుకుల ఎమోషన్

Gaali Sampath trailer Out.యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం గాలి సంప‌త్‌. 'అలా ఎలా' ఫేమ్ అనీష్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 1:00 PM IST
గాలి సంప‌త్ ట్రైల‌ర్‌.. తండ్రీకొడుకుల ఎమోషన్

యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం 'గాలి సంప‌త్‌'. 'అలా ఎలా' ఫేమ్ అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈచిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పిస్తుండ‌గా.. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి చేతుల మీదుగా విడుద‌లైంది.

'పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది' అంటూ హీరో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ వల్ల ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మాటలు రాని తండ్రి అనుకోకుండా ఓ బావిలో పడటం.. తండ్రిని వెతికే సమయంలో కొడుకు పడే వేదనను ఇందులో చూపించారు. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ నటన ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.




Next Story