సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది నటీ నటులు అభిమానలతో టచ్‌లో ఉంటున్నారు. వారి అభిరుచులను చెబుతూ.. ప్రస్తుతం ఏం చేస్తున్నామనే విషయాలను తెలియజేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. అయితే.. ఇటీవల నటీ నటుల పేరుతో ఫేక్ అకౌంట్స్ పెరిగిపోతున్నాయి. వారి పేరు మీద ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా గాయని రమ్య బెహరా పేరుమీద ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసిన కేటుగాళ్లు.. ఆమె పేరుతో నగదును అడుగుతున్నారు. ఈ విషయం గుర్తించిన రమ్య బెహరా.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ అందరిని అప్రమత్తం చేసింది.
బాహుబలి చిత్రంలో ధీవర పాటతో చాలా ఫేమస్ అయ్యారు గాయని రమ్య బెహరా. సోషల్ మీడియా యమా యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తన పేరుతో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకుంది. తన పేరు మీద ఎవరో ఫేక్ కాల్స్ చేస్తున్నారని.. సదరు నంబర్‌ను స్క్రీన్‌షాట్ చేస్తూ ఇది తనది కాదని స్పష్టం చేసింది. ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తే స్పందించవద్దని.. వెంటనే బ్లాక్ చేయాలని సూచించింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అప్రమత్తం చేసినందుకు ధన్యవాదాలు అని.. ఇలాంటి వారిని ఉరికే వదలకూడదని కామెంట్లు పెడుతున్నారు.