పుష్ప మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్
Fourth song release from Pushpa movie on November 19th.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్
By తోట వంశీ కుమార్
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందాన్నా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రలో బన్ని కనిపించనున్నాడు. రెండు బాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తొలి భాగం డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రయోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా నాలుగో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది. 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ ఈ పాట సాగనుంది. నవంబర్ 19న ఈ పాటను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందం వెల్లడించింది.
SwAAg of #PushpaRaj 😎#EyyBiddaIdhiNaaAdda song out on 19th NOV 💥💥#PushpaFourthSingle 🤘#PushpaTheRise #PushpaTheRiseOnDec17 pic.twitter.com/Sw5DltVSAs
— Pushpa (@PushpaMovie) November 14, 2021
ఇదిలా ఉంటే.. చిత్రం నాలుగు భాషల్లో అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళం, మలయాళం భాషలలో అలు అర్జున్ మాట్లాడగలుగుతాడు. అలాగే కన్నడ భాష కూడా తెలుగుకు దగ్గరగా ఉంటుంది. ఈ భాష కూడా బన్నీ బాగానే మాట్లాడగలడు. కాబట్టి తెలుగుతో పాటు ఈ మూడు భాషల్లో సొంతగా డబ్బింగ్ చెప్పడం కష్టం కాదు. అందుకే బన్ని 'పుష్ప' అన్ని భాషల వర్షన్‌లకు తానే డబ్బింగ్ చెప్తానంటూ అనట్లు తెలుస్తోంది. అయితే, హిందీ భాష మీద అంతపట్టు లేకపోవడంతో ఒక్క హిందీ వెర్షన్‌కు మాత్రం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పిస్తున్నారట.