ఆస్ప‌త్రి బెడ్‌పై స‌మంత‌.. య‌శోద ఫ‌స్ట్ గ్లింప్స్‌

Firstlook of Samantha's 'Yashoda' is out.స్టార్ హీరోయిన్ స‌మంత న‌టిస్తున్న చిత్రం య‌శోద‌. పాన్ ఇండియా చిత్రంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2022 9:28 AM GMT
ఆస్ప‌త్రి బెడ్‌పై స‌మంత‌.. య‌శోద ఫ‌స్ట్ గ్లింప్స్‌

స్టార్ హీరోయిన్ స‌మంత న‌టిస్తున్న చిత్రం 'య‌శోద‌'. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు హరి – హరీష్ ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఆగ‌స్టు 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు ఆక‌ట్టుకోగా.. తాజాగా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను చిత్ర‌బృందం విడుదల చేసింది.

ఇందులో సామ్‌.. ఆస్ప‌త్రి బెడ్ పై కళ్ళు తెరిచి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో కనిపించింది. బయట ప్రపంచాన్ని చూడడానికి కిటికీ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. స‌మంత‌కు ఏమైంది. దాన్ని ఆమె ఎలా ఎదుర్కొంది..? వంటి ప్ర‌శ్న‌ల‌కు సినిమా విడుద‌లైన త‌రువాతే స‌మాధానాలు దొరుకుతాయి. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ఉన్ని ముకుంద‌న్‌, రావు ర‌మేష్, ముర‌ళీ శ‌ర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story