'ఆర్ఆర్ఆర్' అప్‌డేట్‌.. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా 'దోస్తీ' సాంగ్

First Song from RRR Movie on August 1st.ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2021 3:04 PM IST
ఆర్ఆర్ఆర్ అప్‌డేట్‌.. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ సాంగ్

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్‌(రౌద్రం, రణం, రుధిరం)'. ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల ప‌ది బాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది చిత్ర‌బృందం.

ఇక ఈ చిత్రం పేరిట ప్ర‌త్యేక పాట‌ను రూపొందించారు. ఒక్కొ భాష‌లో ఒక్కో సింగ‌ర్ తో ఈ పాట‌ను పాడించారు. సిరివెన్నెల లిరిక్స్ రాయగా, తెలుగులో హేమచంద్ర, అమిత్ త్రివేది (హిందీ), అనిరుధ్ (తమిళ్), విజయ్ జేసుదాస్ (మలయాళం), యాసిన్ నిజార్ (కన్నడ) భాషల్లో ఈ పాట పాడారు.ఎం.ఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఆగ‌స్టు 1వ తేదీ ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. స్నేహం విలువ‌ని చాటిచెప్పే గీత‌మిది.

ఈ పాట అభిమానుల‌ను ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతోంది చిత్ర‌బృందం. పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నారు. అలియా భ‌ట్, ఒలివియా మోరీస్ క‌థానాయిక‌లు. డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story