సమంత, చైతూ విడాకుల‌పై స్పందించిన ఆమె తండ్రి జోసెఫ్.. తీవ్ర ఆవేదన..!

First reaction of Samantha's father Joseph after divorce.టాలీవుడ్ క‌పుల్ స‌మంత‌, నాగ‌చైత‌న్య త‌మ వైవాహిక జీవితానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Oct 2021 5:19 AM GMT
సమంత, చైతూ విడాకుల‌పై స్పందించిన ఆమె తండ్రి జోసెఫ్.. తీవ్ర ఆవేదన..!

టాలీవుడ్ క‌పుల్ స‌మంత‌, నాగ‌చైత‌న్య త‌మ వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. వీరు విడిపోవ‌డం అభిమానుల‌కే కాదు.. సెల‌బ్రెటీల‌కు సైతం పెద్ద షాకేన‌ని చెప్ప‌వ‌చ్చు. చై, సామ్ జంట విడాకుల విష‌యం తెలిసిన సెల‌బ్రెటీలు, నెటీజ‌న్లు ఎవ‌రిదైన శైలిలో వారు స్పందించారు. అయితే.. స‌మంత త‌ల్లిదండ్రుల స్పంద‌న ఏంటి అనేది ఇప్పుడు చాలా మంది మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. కుమారై ఎంత పెద్ద సెల‌బ్రెటీ అయినా కూడా.. ఓ ఆడపిల్లని కన్నవాడిగా సమంత తండ్రి బాధ వర్ణనాతీతం.

స‌మంత తండ్రి జోసెఫ్ తొలిసారి స్పందించారు. త‌న కుమారై విడాకుల గురించి తెలిశాక‌.. త‌న‌కేమీ తోచ‌లేద‌ని.. త‌న మైండ్ బ్లాంక్ అయ్యింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. సమంత అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందన్నారు. త్వ‌ర‌లోనే ప‌రిస్థితులు అన్ని స‌ర్దుకుంటాయ‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. నెటిజ‌న్లు స‌మంత తండ్రిని ఓదార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇక విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం చైతు ఓ హోట‌ల్‌లో ఉంటుండ‌గా.. స‌మంత చెన్నైలో షూటింగ్‌లో బిజీ అయిపోయింది. ఇక స‌మంత ఎప్ప‌టిలాగే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది.

మూడేళ్ళ వివాహ బంధానికి వీడ్కోలు ప‌లికిన ఈ జంట త‌మ సోష‌ల్ మీడియాలో.. మా శ్రేయోభిలాషులందరికీ.. చాలా చర్చలు, ఆలోచనల అనంత‌రం మేము.. మా స్వంత మార్గాలు కొనసాగించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దశాబ్ద కాలానికి పైగా స్నేహాన్ని కలిగి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని, మాకు అవసరమైన గోప్యతను అందించాలని మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను మేము అభ్యర్థిస్తున్నాం. మీ మద్దతుకు ధన్యవాదాలు అని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.

Next Story
Share it