విశ్వదాభిరామ.. ఎఫ్3 సాంగ్స్ హంగామా షురూ రా మామా

First lyrical song release from F3 movie on February 7th.విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా నటిస్తు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2022 11:41 AM IST
విశ్వదాభిరామ.. ఎఫ్3 సాంగ్స్ హంగామా షురూ రా మామా

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న‌ చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రాన్ని దిల్‌రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న మెహ‌రీన్‌లు న‌టించారు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ఇంత‌క‌ముందే ప్ర‌క‌టించింది.

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మొదలు పెట్టింది. ఈ చిత్రంలోని మొద‌టి పాట‌ను ఫిబవ‌రి 7వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ల‌బ్ డ‌బ్ ల‌బ్ డ‌బ్ డ‌బ్బో.. అంటూ ఈ పాట రిలిక్స్ ఉండ‌నున్న‌ట్లు తెలిపింది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సునీల్, అంజలి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్ర క‌థ మొత్తం డ‌బ్బు చుట్టే తిర‌గ‌నుంది. ఇక ఈ చిత్రంలో వెంకికీ రేచీక‌టి, వ‌రుణ్ తేజ్ న‌త్తి ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్ప‌టికే రివీల్ చేయ‌డంతో.. సినిమాపై మ‌రిన్ని అంచాన‌లు పెరిగాయి.

Next Story