సూపర్‌ హీరో వచ్చేశాడు.. 'హ‌ను-మాన్' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

First look release from Hanu Man Movie.సూప‌ర్ హీరోలు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. స్పైడ‌ర్ మ్యాన్‌,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2021 6:25 AM GMT
సూపర్‌ హీరో వచ్చేశాడు.. హ‌ను-మాన్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

సూప‌ర్ హీరోలు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. స్పైడ‌ర్ మ్యాన్‌, బ్యాట్‌మాన్ వంటి వారు మాత్ర‌మే గుర్తుకువ‌స్తారు. వాళ్లు చేసే సాహ‌సాల‌ను మ‌నం వెండితెర‌పై చూసి చాలా ఆనందిస్తుంటాం. అయితే.. వీళ్లంతా విదేశీ సూప‌ర్ హీరోలు.. కానీ మ‌న పుర‌ణాల్లో రియ‌ల్ సూప‌ర్ హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో ఉన్న సూప‌ర్ హీరోనే హ‌నుమాన్. 'అ!' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు 'హ‌ను-మాన్' అనే టైటిట్‌తో ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

'హను-మాన్' అనేది ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీ. ఈ చిత్రంలో తేజు స‌జ్జా హీరోగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర‌బృందం అధికారికంగా విడుద‌ల చేసింది. హ‌నుమంతు పాత్ర‌ని పరిచయం చేసే 65 సెకన్ల గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లిమ్స్ ని విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు అందజేశారు.

ఈ పోస్టర్‌లో తేజ సజ్జా దట్టమైన అడవిలో ఒక చెట్టుపై నిలబడి స్లింగ్ షాట్‌తో తన లక్ష్యాన్ని కొట్టడానికి రెడీగా ఉండటాన్ని చూడవచ్చు. సరికొత్త కాన్సెప్ట్ తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందిస్తుందని హింట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story
Share it