దేవుడిపై న‌టి శ్వేతా తివారీ వ్యాఖ్య‌లు.. ఎఫ్ఐఆర్ నమోదు

FIR Lodged Against Shweta Tiwari for 'Hurting Religious Sentiments.బాలీవుడ్ న‌టి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్య‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 5:01 AM GMT
దేవుడిపై న‌టి శ్వేతా తివారీ వ్యాఖ్య‌లు.. ఎఫ్ఐఆర్ నమోదు

బాలీవుడ్ న‌టి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌తపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు నటి శ్వేతా తివారీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భోపాల్‌లోని శ్యామలా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295(ఎ) కింద కేసు నమోదైంది.

ఏం వ్యాఖ్య‌లు చేసిందంటే..?

బాలీవుడ్ న‌టి శ్వేతా తివారీ 'షో స్టాపర్ అనే వెబ్ సిరీస్‌లో న‌టించింది. ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న‌ల్‌లో భాగంగా బుధ‌వారం బోపాల్ వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడింది. తన లోదుస్తుల గురించి ప్రస్తావించారు. ఆ సందర్భంగా దేవుడి ప్రస్తావన తీసుకొచ్చారు. 'దేవుడు నా బ్రా కొలతలు తీసుకుంటున్నాడు. చాలా మందికి ఇది నచ్చడం లేదు' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. శ్వేతా తివారీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఆమె తోటి నటీనటులు రోహిత్ రాయ్, సూర్యవంశీ, సౌరభ్ రాజ్ కూడా పక్కనే ఉన్నారు.

ఆమె చేసిన వ్యాఖ్య‌లను హిందూ సంస్థలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. ఆమె చేసిన వ్యాఖ్య‌లు హిందూ దేవుళ్ల‌ను కించ‌ప‌రిచేలా ఉన్నాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శ్వేతా తివారీ వెంట‌నే బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. ఇక ఈ విష‌యంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. శ్వేతా తివారి చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. 'శ్వేతా తివారీ చేసిన వ్యాఖ్యలు నేను విన్నాను. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. తివారీ వ్యాఖ్యలపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా భోపాల్ పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. మంత్రి ఆదేశాలతో శ్వేతా తివారీకి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్ 295(ఏ) కింద శ్యామలాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story