స్టార్ హీరోయిన్‌ని వేధించిన దర్శకుడి అరెస్ట్
Filmmaker Sanal Kumar Sasidharan arrested on Manju Warrier's complaint.చిత్ర పరిశ్రమలో ఇటీవల వేధింపులు
By తోట వంశీ కుమార్ Published on 6 May 2022 1:48 PM ISTచిత్ర పరిశ్రమలో ఇటీవల వేధింపులు పెరిగిపోతున్నాయి. కొందరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటుండగా.. మరికొందరు ఎవ్వరికి చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. మలయాళ నటి మంజు వారియర్‌ను వేధింపులకు గురి చేసిన కేసులో ప్రముఖ దర్శకుడు డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురంలో గురువారం(మే 5) ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. 2020లో 'కయాట్టం' అనే చిత్రంలో మంజు వారియర్ నటించింది. ఈ చిత్రానికి సనల్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం విడుదలైన అయిన తరువాత కూడా దర్శకుడు సనల్ కుమార్ అదే పనిగా తనకు మెసేజ్‌లు చేస్తూ వేదింపులకు గురిచేశాడని మంజు వారియర్ ఆరోపించింది. ఎన్ని సార్లు చెప్పినా, నంబర్‌ని బ్లాక్ చేసినా కూడా అతడు వినిపించుకోలేదని తెలిపింది.
దీంతో అతడి వేధింపులు భరించలేక మంజు వారియర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం సనల్‌కుమార్ ఇంటికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కొచ్చికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వార్త మలయాళ సినీ పరిశ్రమంలో సంచలనంగా మారింది. పలు హిట్ చిత్రాలను తీయడమే కాక ఎన్నో అవార్డులు అందుకున్న దర్శకుడు ఇలాంటి నీచమైన పనులు చేయడం ఏంటీ అని నెటీజన్లు సనల్ కుమార్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళలను ఇబ్బంది పెట్టేవారికి కఠిన శిక్షలు పడాలంటూ కామెంట్లు పెడుతున్నారు.