ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఇంట తీవ్ర విషాదం

Filmmaker and radio personality SV Ramanan passes away.అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఇంట విషాదం నెల‌కొంది.ఆయ‌న తాత‌ ఎస్వీ ర‌మ‌ణ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2022 5:40 AM GMT
ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఇంట తీవ్ర విషాదం

ప్ర‌ముఖ సంగీత‌ ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తాత‌, సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు, రేడియో డ‌బ్బింగ్ క‌ళాకారుడు, న‌టుడు ఎస్వీ ర‌మ‌ణ‌న్ క‌న్నుమూశారు. వృద్దాప్య సంబంధిత స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతూ సోమ‌వారం తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 87 సంవ‌త్స‌రాలు. ఎస్వీ రమణన్ మృతి పట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ‌ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు శాఖ‌ల్లో మంచి పేరు తెచ్చుకున్న ఎస్‌వీ ర‌మ‌ణ‌న్.. రేడియో రంగంలో ప‌లు ప్ర‌యోగాలు చేశారు. వేలాది రేడియో ప్ర‌సారాల‌ను డ‌బ్బింగ్ చెప్పారు. ప‌లు భ‌క్తిర‌స ల‌ఘు చిత్రాల‌ను రూపొందిచారు. 'యారుక్కాగ అశుదాన్' చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. 'ఉరువంగ‌ళ్ మార‌లామ్' అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో శివాజీగ‌ణేశ‌న్‌, క‌మ‌ల‌హాస‌న్‌, ర‌జినీకాంత్‌లు అతిథి పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్వీ రమణన్ కు భార్య భామా రమణన్, కుమార్తెలు లక్ష్మి, సరస్వతి ఉన్నారు.

Next Story