య‌ష్ పుట్టిన రోజు.. ఈ సారి మ‌రింత డేంజ‌ర్‌గా రాఖీ బాయ్‌

Ferocious Monster Rocky Bhai’s New Poster Release.కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు క‌న్న‌డ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2022 11:51 AM IST
య‌ష్ పుట్టిన రోజు.. ఈ సారి మ‌రింత డేంజ‌ర్‌గా రాఖీ బాయ్‌

'కేజీఎఫ్' చిత్రంతో దేశ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు క‌న్న‌డ స్టార్ య‌ష్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 'కేజీఎఫ్‌-2'లో న‌టిస్తున్నారు. 'కేజీఎఫ్' చిత్రానికి సీక్వెల్‌గా ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో య‌ష్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తోంది. కాగా.. నేడు హీరో య‌ష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా 'కేజీఎఫ్ 2' చిత్ర బృందం య‌ష్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

'హెచ్చరిక.. ఓ డేంజర్ ముందుంది. ఆ డేంజ‌ర్ పేరు రాకీ భాయ్‌..!' అంటూ ట్వీట్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో రాఖీబాయ్ చాలా సీరియ‌స్‌గా కనిపిస్తున్నాడు. హోంబలె ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్, టాలీవుడ్ నటుడు రావు రమేష్ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా య‌ష్ మాట్లాడుతూ.. 'నా పుట్టినరోజు నా అభిమానుల కోసమే. నేను నటుడిని. నాకు పెద్ద కుటుంబం ఉంది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మాత్రమే కాకుండా నా అభిమానులంతా నా కుటుంబమే. ఈ కరోనా సమయంలో పుట్టినరోజును ఎలా జరుపుకోవాలో, ఏం చేయాలో మాకు తెలియట్లేదు' అని అన్నాడు.

ఇక 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' గురించి మాట్లాడుతూ.. అభిమానుల్లాగే తాము కూడా ఈచిత్ర కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపాడు. ఏం తీశామో మాకు తెలుసు. ఈ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని నాకు తెలుసు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ వల్ల కొంచెం టైమ్ తీసుకుంటుందని చెప్పాడు.

Next Story