'ఆచార్య' సెట్‌లో సోనూసూద్‌కు సత్కారం

Felicitated to Sonu sood in Acharya sets.. సోనూసూద్‌.. ఈ పేరు వింటేనే హీరోనే కాకుండా మానవత్వం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు

By సుభాష్  Published on  21 Nov 2020 12:48 PM IST
ఆచార్య సెట్‌లో సోనూసూద్‌కు సత్కారం

సోనూసూద్‌.. ఈ పేరు వింటేనే హీరోనే కాకుండా మానవత్వం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు సోనూసూద్‌ దేశ వ్యాప్తంగా దేవుడయ్యాడు. కరోనా విపత్కర సమయంలో లాక్‌డౌన్‌లో ఎంతో మంది పేదలకు ఆదుకుని రియల్‌ హీరో అనుపించుకున్నాడు. నిరుపేదలతో పాటు విద్యార్థుల వరకు అందరికి అండగా నిలుస్తూ సాయం అందించి శభాష్‌ అనిపించుకుంటున్నాడు. సాయానికి మరో పేరంటూ అది సోనూసూదేనని చెప్పాలి.

ఈ రియల్‌ హీరోకు ఎన్నో అరుదైన గౌరవాలు దక్కుతున్నాయి. తాజాగా ఆయన మరో సత్కారం అందుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్‌ సమర్పణలో మాట్నీ మూవీస్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌ చరణ్‌ సంయుకత్ంఆ నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల పునః ప్రారంభమైంది. మరి కొన్ని రోజుల్లో మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొనబోతున్నారు. అయితే తాజాగా సోనూసూద్‌కు ఆచార్య సినిమా షూటింగ్‌ సెట్లో అడుగు పెట్టాడు. లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్‌ అందించిన మానవత సేవలను ప్రశంసిస్తూ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ, చిత్ర యూనిట్‌తో కలిసి ఆచార్య సెట్‌లో ఘనంగా సత్కరించారు. శాలువ కప్పి మెమోంటో అందజేశారు. కాగా, ఈ సత్కారానికి సంబంధించిన ఫోటోలు నిర్మాత బీఏ రాజే తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇదిలా ఉంటే ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ 'అల్లుడు అదుర్స్‌' షూటింగ్‌లో సోనూసూద్‌ పాల్గొన్న విషయం తెలిసిందే.

కాగా, సోనూసూద్‌ కోవిడ్‌ సమయంలో వలస కార్మికులకు, విద్యార్థులకు, నిరుపేదలకు చేసిన సాయం వెలకట్టలేనిది. ఎవరైన కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారంటే చాలు వారికి 'నేనున్నాను' అంటూ ముందుకొస్తాడు. రీల్‌ విలన్‌ నుంచి యావత్‌ భారతదేశానికి రియల్‌ హీరోగా మారిపోయాడు.



Next Story