వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి 'కైలాస' అని పేరు పెట్టుకుని అందులోనే నివసిస్తున్నాడు. ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నా ఆయనకు భక్తులు ఎక్కువే. ఇటీవల కాలంలో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అప్పట్లో ఓ హీరోయిన్‌తో నిత్యానంద ఏకాంతంగా ఉన్న వీడియోలు సంచలనం సృష్టించగా.. తాజాగా ఇప్పుడు మరో కథానాయిక అతడిపై మనస్సు పారేసుకుంది. నిత్యానందను పెళ్లి చేసుకోవాలని ఉంది అని తన మనసులోని మాటను బయట పెట్టేసింది. ఆమె మరెవరో కాదు ప్రియా ఆనంద్. అమెరికాలో పెరిగిన ఈ బ్యూటీ బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది.
2009లో కోలీవుడ్‌లో 'వామనన్' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది ప్రియా ఆనంద్. ఆ తరువాత శివకార్తికేయన్, అధర్వ, విక్రమ్ ప్రభు, గౌతమ్ కార్తీక్, ఆర్‌జే బాలాజీకి జంటగా నటించింది. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'అందగన్', 'సుమో', 'కాసేతన్' వంటి చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చింది. తాను నిత్యానందస్వామిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆయన గురించి ఎలాంటి ప్రచారం జరుగుతున్నా వేలాది మంది భక్తులు ఆరాధిస్తున్న వ్యక్తి అని చెప్పుకొచ్చింది. ఆయన్ని వివాహం చేసుకుంటే తన పేరు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటూ సరదాగా అంది. ఈ వ్యాఖ్యలలో ప్రియా ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.