ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫర్ క‌న్నుమూత‌

Famous Cinematographer Shivan passes away.సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 9:11 AM GMT
ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫర్ క‌న్నుమూత‌

సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇటీవ‌ల ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆ విషాదాల నుంచి తేరుకోక‌ముందే తాజాగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌న్ క‌న్నుమూశారు. కేర‌ళ‌లోని ఆయ‌న ఇంట్లో గుండెపోటుతో నేటి ఉద‌యం మ‌ర‌ణించిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న వ‌య‌స్సు 89 సంవ‌త్స‌రాలు. శివ‌న్ ఇక‌లేర‌ని తెలిసి సినీ వ‌ర్గాలు షాకైయ్యాయి. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

శివన్ మృతి ప‌ట్ల కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్‌, గ‌వ‌ర్న‌ర్ అరిఫ్ అహ్మ‌ద్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కాగా.. శివ‌న్‌కు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తండ్రి శివన్ అడుగు జాడల్లోనే నడిచిన రెండో కుమారుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా ఫేమస్ అయ్యారు. మిగిలిన ఇద్దరు కుమారులు సంగీత్, సంజీవ్ కూడా సినీ రంగంలోనే స్థిరపడ్డారు.

తిరువనంతపురంలో శివన్ స్టూడియో పేరుతో ఫోటో స్టూడియో పెట్టిన శివన్.. అంచెలంచెలుగా ఎదిగి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పాపులర్ అయ్యారు. ఆయన తీసిన ఫోటోలు నేషనల్ జియోగ్రాఫిక్, న్యూస్ వీక్, స్పాన్ వంటి పలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. మూడు సార్లు ఆయ‌న నేష‌న‌ల్‌ అవార్డు విన్న‌ర్‌గా నిలిచారు.

Next Story
Share it