తెలుగు వినోద రంగంలో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే అందరికి గుర్తుకువచ్చేది వన్ అండ్ ఓన్లీ జీ తెలుగు. తెలుగు ప్రేక్షకుల్ని అనునిత్యం ఎంటర్టైన్ చేస్తున్న జీ తెలుగు 17 ఏళ్లు పూర్తి చేసుకుని మరో మైలురాయిని అధిగమించింది. ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జీ తెలుగు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. జీ తెలుగు మహోత్సవం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం జీ తెలుగులో మే 22 సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కానుంది.
జీ తెలుగు ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించింది జీ తెలుగు. ఇక ఈ కార్యక్రమంలో ఎఫ్-3 టీమ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, వరుణ్తేజ్, మెహ్రీన్, సోనాల్, సునీల్, దర్శకుడు అనీల్ రావిపూడి తమ అల్లరితో కార్యక్రమాన్ని మరింత ఉల్లాసభరింతగా మార్చేశారు. అందరికంటే ఎక్కువగా విక్టరీ వెంకటేశ్ చేసిన కామెడీ, నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ప్రతీ ఒక్కరూ కచ్చితంగా చూసి తీరాల్సిందే..
ఇంతకుముందెప్పుడు కనీవినీ ఎరుగుని రీతిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌లను జీ తెలుగు మహోత్సవంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. సరిగమపలో పాల్గొని ప్రతీ ఒక్కరి కుటుంబ సభ్యురాలిలా మారిపోయింది సింగర్ పార్వతి. ఆమె ప్రయాణంపై సరిగమప సింగర్స్, రీల్ జోడీలు ఇచ్చిన ప్రదర్శన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వీటితోపాటు కొన్ని ఫన్ గేమ్స్ మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తాయి.