నేడు వెంకీమామ బర్త్ డే.. 'ఎఫ్ 3' నుంచి స్పెషల్ వీడియో

F3 Movie Team Birthday Wishes to Victory Venkatesh.విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2021 1:42 PM IST
నేడు వెంకీమామ బర్త్ డే.. ఎఫ్ 3 నుంచి స్పెషల్ వీడియో

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టిస్తోంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌ధానంగా డబ్బు చుట్టూ తిరుగుతుంద‌ని.. ఇందులో వెంకికీ రేచీక‌టి, వ‌రుణ్ తేజ్ న‌త్తి ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇప్ప‌టికే రివీల్ చేశాడు.

కాగా.. ఈ రోజు వెంక‌టేష్ 61వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, 'ఎఫ్ 3 చిత్ర‌బృందం ఓ పోస్టర్ తో పాటు సినిమాకి సంబంధించిన ఒక‌ స్పెషల్ వీడియోను విడుద‌ల చేసింది. చార్మినార్ సెంటర్లో పరుపు వేసుకుని కరెన్సీ కాయితాలతో విసురుకుంటున్న సుల్తాన్ లుక్ తో వెంకటేశ్ కనిపిస్తున్నారు.ఇది వెంకీ, వరుణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కు సంబంధించిన క్లిప్ గా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సునీల్, అంజలి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story